భారతదేశం, ఫిబ్రవరి 7 -- ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖ‌ప‌ట్నం నుంచి నాలుగు స్పెష‌ల్ రైళ్లు, గుంటూరు, తిరుప‌తి నుంచి రెండేసి చొప్పున స్పెషల్ రైళ్ల‌ను న‌డ‌ప‌డాలని నిర్ణ‌యించింది. ఈ రైళ్ల స‌దుపాయాన్ని వినియోగించుకోవాల‌ని ప్ర‌యాణికుల‌కు ఇండియ‌న్ రైల్వే విజ్ఞప్తి చేసింది.

1. రైలు నెంబ‌ర్ 08530 విశాఖ‌ప‌ట్నం-పండిట్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ జంక్ష‌న్‌ స్పెషల్ రైలును అందుబాటులోకి తీసుకుకొచ్చారు. ఈ రైలు ఫిబ్ర‌వ‌రి 20, 27 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ‌ప‌ట్నం నుండి బయలుదేరుతుంది. ఫిబ్ర‌వ‌రి 22, మార్చి తేదీల్లో 29 తెల్ల‌వారుజామున 4.30 గంటలకు పండిట్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ జంక్ష‌న్‌కు చేరుకుంటుంది.

2. రైలు నెంబ‌ర్ 08529 పండిట్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ జంక్ష‌న్‌ -విశాఖ‌ప‌ట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోక...