భారతదేశం, ఫిబ్రవరి 27 -- Special Trains: ప్ర‌యాణికులు ర‌ద్దీని త‌గ్గించేందుకు విజ‌య‌వాడ మీదుగా చ‌ర్ల‌పల్లి-కాకినాడ టౌన్, చ‌ర్ల‌ప‌ల్లి-న‌ర్సాపూర్ మ‌ధ్య రెండు స్పెష‌ల్ వీక్లీ రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

1. చ‌ర్ల‌ప‌ల్లి-కాకినాడ (07031) స్పెష‌ల్ వీక్లీ రైలు ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో (శుక్రవారం) అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో రాత్రి 7.20 గంట‌ల‌కు చ‌ర్ల‌ప‌ల్లిలో బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల‌కు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.

2. కాకినాడ టౌన్‌-చ‌ర్ల‌ప‌ల్లి (07032) స్పెష‌ల్ వీక్లీ రైలు మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో (ఆదివారం) అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఆయా తేదీల్లో సాయంత్రం 6.55 గంట‌ల‌కు కాకినాడ టౌన్‌లో బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు ఉద‌యం 6.50 గంట‌ల‌కు చ‌ర్ల‌ప‌ల్లికి చేరుక...