భారతదేశం, మార్చి 20 -- Sparrow Day: కరీంనగర్ లోని కిసాన్ నగర్ చెందిన అనంతుల రమేష్ ఇంటి ఆవరణలో ఎటు చూసినా పిచ్చుకలు కనిపిస్తుంటాయి. వాటి కోసం అతను ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. మొదట ఒక్కటి, రెండు పక్షులు ఇంటి అవరణకు వచ్చేవి. వాటికి గూడు లేక, ఆహారం లేక ఇబ్బంది పడ్డాయి. వాటిని రమేష్ గమనించాడు. దీంతో పిచ్చుకల కోసం గూళ్లు ఏర్పాటు చేశాడు.

పిచ్చుకలకు కావాల్సిన ఆహారం కూడా ఏర్పాటు చేశాడు. కరీంనగర్‌ లోని ఇంటి ఆవరణలో చెట్లు కూడా ఉండటంతో క్రమంగా వీటి సంఖ్య పెరిగిపో యింది.. వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా చిప్పలు ఏర్పాటు చేసి నీళ్ళు పోసి పెడుతున్నాడు. దీంతో పిచ్చుకలన్నీ అక్కడికే వస్తున్నాయి.

దాదాపుగా 300 నుంచీ 400 వరకు పిచ్చుకలు ఈ ఇంటి అవరణలో కనిపిస్తాయి. వీటికి ఆహారంగా వివిధ రకాల గింజలను ఏర్పాటు చేశారు. కొన్ని పక్షులు సహజంగానే రమేష్ ఇంట్లో గూళ్లు ఏర్ప...