భారతదేశం, ఏప్రిల్ 14 -- అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ మరో అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టింది. బెజో‌స్‌కు కాబోయే సతీమణి లారెన్ శాంచెజ్, ప్రపంచవ్యాప్తంగా తన పాప్ షోల ద్వారా ప్రజలను ఊర్రూతలుగించిన కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్ కింగ్.. ఇలా మెుత్తం ఆరుగురు మహిళలు అంతరిక్ష యాత్రను పూర్తి చేశారు.

బ్లూ ఆరిజిన్‌కు చెందిన న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా ఆరుగురు మహిళలు పైకి వెళ్లారు. ఈ మిషన్ కేవలం 10 నిమిషాలు మాత్రమే జరిగింది. వ్యోమనౌకలో భూ ఉపరితలానికి సుమారు 106 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లారు. ఈ సమయంలో జీరో గ్రావిటీని అనుభవించిన తరువాత భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ వెలుగులోకి రాగానే మరోసారి స్పేస్ టూరిజంపై చర్చలు మొదలయ్యాయి.

స్పేస్ టూరిజానికి సంబంధించి కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది. బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్ట...