భారతదేశం, ఫిబ్రవరి 23 -- Spa Center Raids : యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్‌ను నిర్వహిస్తున్నవారి గుట్టుర‌ట్టు అయింది. పోలీసులు దాడుల్లో ప‌ది మంది అమ్మాయిలు, 13 మంది విటులు అరెస్టు అయ్యారు. నిర్వాహ‌కుడు ప్రస‌న్న భార్గవ్ ప‌రారీలో ఉన్నాడు. నిర్వాహ‌కుడి కోసం పోలీసులు గాలింపు చ‌ర్యలు చేపడుతున్నారు.

ఈ వ్యవ‌హారం విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట‌లోని వెట‌ర్నరీ కాల‌నీలో వెలుగులోకి వ‌చ్చింది. మాచ‌వ‌రం సీఐ ప్రకాష్ తెలిపిన వివ‌రాల ప్రకారం వెట‌ర్నరీ కాల‌నీ స‌ర్వీస్ రోడ్డు స‌మీపంలో స్టూడియో 9, ఏసీ 23 పేరుతో చ‌ల‌సాని ప్రస‌న్న భార్గవ్ యూట్యూబ్ ఛాన‌ల్ నిర్వహిస్తున్నాడు. ఆ బిల్డింగ్ పై భాగంలో స్పా సెంట‌ర్ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ ఛాన‌ల్ నిర్వహిస్తున్నట్లు న‌మ్మించి ఆ ముసుగులో స్పా సెంట‌ర్లో వ్యభిచారం వ్యవ‌హారాలు న‌డుపుతున్నాడు.

యూట్యూబ్ ఛాన‌ల్ పేరుతో బోర్డులు ప...