Hyderabad, మార్చి 9 -- మీల్‌మేకర్లు ఆరోగ్యానికి చేసే మేలు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఎన్నో రకాల ప్రొటీన్లు కలిగిన మీల్‌మేకర్ ఎముకల నుంచి గుండె వరకూ, హార్మోన్ సమస్యల నుంచి అరుగుదల వరకూ చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. అందుకే వీటిని ఏదో ఓక రకంగా తమ డైట్లో చేర్చుకోవాలంటారు ఆరోగ్య నిపుణులు. మీల్‌మేకర్‌తో మీరు ఇప్పటి వరకూ కర్రీ తిని ఉండచ్చు, మీల్‌మేకర్ రైస్ కూడా రుచి చూసే ఉండచ్చు. ఈసారి కొత్తగా మీల్‌మేకర్ పకోడీని ట్రై చేసి. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వీటిని చేసి పెట్టారంటే వారు చాలా సరదాగా తినేస్తారు. ఇంటికి వచ్చిన అతిథులకు అప్పటికప్పుడు ఈజీగా, త్వరగా వీటిని తయారు చేసి పెట్టచ్చు. రుచిలో కూడా మీల్‌మేకర్ పకోడీలు అద్భుతంగా ఉంటాయి. మరి వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా..

దీన్ని సాయంత్రం టీ, కాఫీలతో పాట...