Hyderabad, ఫిబ్రవరి 16 -- ప్రోటీన్లకు మూలమైన మీల్‌మేకర్లను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. పోషకాల్లోనే కాదు రుచిలో కూడా సోయా చంక్స్ ఏం తక్కువ చేయవు. అయితే ఇప్పటి వరకూ మీరు మీల్ మేకర్లతో ఒకే రకమైన గ్రేవీ కూరతో విసిగిపోయి ఉంటే.. వీటితో కొత్త రెసిపీని ట్రై చేయాలనుకుంటే ఇది మీ కోసమే. కరకరలాడే మీల్‌మేకర్ డ్రై కర్రీ రెసిపీని తయారు చేసి ఇంట్లో వారికి పెట్టండి. దీని రుచి పెద్దల నుండి పిల్లల వరకు అందరికీ బాగుంటుంది. ఉదయాన్నే లంచ్ బాక్సుల్లోకి చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. సాయంత్రం లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకున్న రోటీలు, చపాతీల్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది.

-మీల్‌మేకర్ డ్రై కర్రీ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో నీరు పోసి వేడి చేయాలి.

నీరు కాస్త వేడిక్కిన తర్వాత దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మీల్‌మ...