Hyderabad, ఏప్రిల్ 8 -- సాయంత్రం కాగానే పిల్లల నుంచి పెద్దల వరకూ కిచెన్లోకి వెళ్లి తినడానికి ఏం ఉన్నాయో వెతుకుతుంటారు. దీనికి అర్థం వాళ్లే టేస్టీ స్నాక్స్ కోసం వెతుకుతున్నట్లు. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంటే మీ బాధ మాకు అర్థమవుతుంది. ప్రతిరోజూ రుచికరమైన స్నాక్స్ చేయడం కష్టంతో కూడుకున్న పనే. అందులోనూ అవి ప్రొటీన్లతో కూడినవి అయి ఉండాలంటే మరీ కష్టం. మీరు కూడా ఇలాగే ప్రొటీన్లతో కూడిన రుచికరమైన స్నాక్స్ కోసం వెతుకుతున్నట్లయితే రెసిపీ మీ కోసమే.

సోయా (మీల్‌మేకర్) చనా దాల్‌తో తయారు టిక్కీలు మీ ఇంట్లో వాళ్ల క్రేజీ ఆకలిని తీర్చడంతో పాటు వారికి ప్రొటీన్లను అందిస్తాయి. ముఖ్యంగా వెజిటేరియన్లకు ఇది బెస్ట్ ప్రొటీన్ స్నాక్. మీల్‌మేకర్ చనా దాల్‌ టిక్కీలలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఇనుము, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎముకలకు బలం చేకూరుతు...