భారతదేశం, ఫిబ్రవరి 15 -- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు గొప్ప చరిత్ర ఉంది. 1874లో అప్పటి నిజాం పాలకుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మించారని చెబుతారు. ఇది 1916 వరకు నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే (ఎన్‌జీఎస్ఆర్)కు ప్రధాన కేంద్రంగా ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత 1951లో ఎన్జీఎస్ఆర్‌ను జాతీయం చేశారు. దీంతో భారతీయ రైల్వేలో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది.

1966లో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పడింది. అప్పుడు సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయంగా మారింది. 1951లో నిజాం శైలి ఉట్టిపడేలా దీన్ని నిర్మించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 1874లో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ నిర్మించారు. ఈ స్టేషన్ మొదట మూడు ప్లాట్‌ఫారమ్‌లతో ఒక సాధారణ భవనంగా ఉండేది. రానురాను అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు.

అయితే.. ఈ స్టేషన్‌ను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం అమృత...