భారతదేశం, మార్చి 8 -- కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎంపీలు సమావేశమయ్యారు. కేంద్రమంత్రితో సమావేశం తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల విషయంపై చర్చించామని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే జంక్షన్‌ అంశాలపై మంత్రి సానుకూలంగా మాట్లాడారని చెప్పారు.

వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రైల్వే లైన్ వేయడానికి రైల్వే మంత్రి అంగీకారం తెలిపారని.. కోమటిరెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజకీయాలు పక్కన పెట్టి.. అభివృద్ధిలో తమతో కలిసి రావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ర...