ఆంధ్రప్రదేశ్,విజయవాడ, ఫిబ్రవరి 22 -- మహాకుంభమేళాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాణికులు భారీగా వెళ్తున్నారు. ఫిబ్రవరి 21వ తేదీ వరకు కుంభమేళాకు వెళ్లిన ప్రయాణికుల వివరాలను విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు.

ఫిబ్రవరి 21వ తేదీ వరకు 60వేలకుపైగా ప్రయాణికులు కుంభమేళాకు వెళ్లారని పేర్కొన్నారు. మొత్తం 115 రెగ్యూలర్ మరియు మరికొన్ని ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని వెల్లడించారు. జనవరి నుంచి ప్రయాగ్ రాజ్ కు ఈ రైళ్లు నడుస్తున్నాయని ప్రకటించారు.

ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ, నర్సాపూర్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు వివరించారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే. జనవరి 13వ తేదీ నుంచి 3.09 కోట్ల మంది యాత్రికులు భారతీయ రైల్వేల ద్వారా ప్రయాగ్‌రాజ్‌చేరినట్లు పేర్కొంది.

ఇక ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతో...