భారతదేశం, ఏప్రిల్ 15 -- ధ‌ర్మ‌వ‌రం రైల్వే స్టేష‌న్ మీదుగా వెళ్లే ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను మే 19 వ‌ర‌కు ర‌ద్దు చేశారు. అందులో కొన్ని రైళ్ల‌ను మే 16 నుంచి 18 మ‌ధ్య పున‌రుద్ధరిస్తారు. తిరుప‌తి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు గుత్తి నుంచి క‌డ‌ప‌, రేణిగుంట మీదుగా వెళ్లేందుకు దారి మ‌ళ్లించిన‌ట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ముఖ్య‌మైన రైళ్లు మే 5 నుంచి 18 వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

1. తిరుప‌తి-గుంత‌క‌ల్లు (57403) డీఈఎంయూ రైలును ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 18వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

2. గుంత‌క‌ల్లు-తిరుప‌తి (57404) డీఈఎంయూ రైలును ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 19వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

3. తిరుప‌తి-క‌దిరిదేవ‌ర‌ప‌ల్లి (57405) ప్యాసింజ‌ర్‌ రైలును ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

4. క‌దిరిదేవ‌ర‌ప‌ల్లి -తిరుప‌తి (57405) ప్యాసింజ‌ర్‌ ...