భారతదేశం, ఫిబ్రవరి 10 -- సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ రైలును రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. 11 రోజుల పాటు ఈ రైలు సేవలు నిలిచిపోనున్నాయి. పలుచోట్ల థర్డ్ ట్రాక్ నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వివరించారు.

ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు ఎక్కువగా భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం సాగిస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఈ ట్రైన్ అనుకూలంగా ఉంటుంది. దీన్ని రద్దు చేయడంతో.. వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరైలు సికింద్రాబాద్ జంక్షన్- కాగజ్‌నగర్ మధ్య.. బీబీనగర్, భువనగిరి, ఆలేర్, జనగాం, రఘునాథ్‌పల్లి, ఘన్‌పూర్, కాజీపేట జంక్షన్, ...