భారతదేశం, ఫిబ్రవరి 4 -- త్వరలో చర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లు, ఎంఎంటీఎస్‌ సర్వీసులను నడుపుతామని.. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. సికింద్రాబాద్‌- గుంటూరు మార్గంలో డబ్లింగ్‌ పూర్తయితే.. మరికొన్ని రైళ్లు నడిపే వెసులుబాటు కలుగుతుందని వివరించారు. ఇటు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచనున్నట్లు చెప్పారు.

ప్యాసింజర్‌ రైళ్లకు సంబంధించి అనేక వినతులొస్తున్నాయని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని జైన్ స్పష్టం చేశారు. ఘట్‌కేసర్‌- యాదాద్రి ఎంఎంటీఎస్‌ లైన్‌ కోసం రూ.650 కోట్లు ఖర్చవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్‌ సిద్ధం చేశామన్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభిస్తామని జీఎం జైన్ వెల్లడించారు. ఎంఎంటీఎస్‌ రెండోదశకు సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వం రూ.491 కోట్లు బకాయి పడిందని వెల్లడించారు.

తెలంగాణలో చేప...