భారతదేశం, ఫిబ్రవరి 6 -- విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌‌ను కేంద్రం ప్రకటించింది. దీంతో కాజీపేట డివిజన్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో కాజీపేట కేంద్రంగా డివిజన్‌ చేస్తామని.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విశాఖ జోన్‌ ఏర్పడింది. దీనివల్ల కొన్ని డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే నుంచి విశాఖ జోన్‌కు వెళతాయి.

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల దక్షిణ మధ్య రైల్వేకు కొత్తగా మరో డివిజన్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనే.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది కాజీపేటకు దక్కే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కాజీపేటకు డివిజన్‌ హోదా స్థానిక ప్రజా ప్రతినిధులకు పరీక్షగా మారింది. ఏపీకి చెందిన నాయకులు పట్టుపట్టి జోన్‌ను సాధించుకున్నారు. దీన్ని స్పూర్తిని తీసుకుని ఇక్కడి నేతలు ఒత్తిడి తేగలిగితే.. త్వరలోనే డివిజన్...