భారతదేశం, జనవరి 31 -- కరీంనగర్‌‌ను సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌తో నేరుగా అనుసంధానించనున్నారు. అందుకోసం మనోహరాబాద్‌- కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టును ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిల్లో భాగంగా.. సిరిసిల్ల సమీపంలో మానేరు నదిపై 2.4 కిలో మీటర్ల పొడవుతో భారీ రైలు వంతెన నిర్మించనున్నారు. దీనికి రూ.332 కోట్లు ఖర్చు కానుందని తెలుస్తోంది.

ఈ వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గోదావరి నదిపై పెద్దపెద్ద వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు మానేరుపై నిర్మించే ఈ వంతెన వాటి సరసన చేరనుంది. విజయవాడలో కృష్ణా నదిపై నిర్మించిన రైలు వంతెన తరహాలో.. ఇనుప గర్డర్లతో దీన్ని నిర్మించబోతున్నారు. రైళ్లు వేగంగా వెళ్లినప్పుడు ఏర్పడే కంపన ప్రభావం పిల్లర్లపై చూపకుండా ఇనుప గర్డర్లు అడ్డుకుంటాయి. దీంతో అధికారులు ఈ డిజైన్‌కే మొగ్గు చూ...