భారతదేశం, డిసెంబర్ 28 -- అనంత‌పురం స్టేషన్ మీదుగా రాక‌పోక‌లు సాగించే ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్టు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే తెలిపింది. అనంత‌పురం మీదుగా రాక‌పోక‌లు నిర్వ‌హించే నాలుగు రైళ్లు, తాడిప‌త్రి, క‌డ‌ప మీదుగా రాక‌పోక‌లు నిర్వ‌హించే రెండు రైళ్లను 2 నెల‌ల పాటు ర‌ద్దు చేశారు. కుంభ‌మేళ పూర్తయ్యాక వీటిని తిరిగి పునరుద్ధ‌రించ‌నున్నారు. మ‌రోవైపు ఈస్ట్ కోస్టు రైల్వే విశాఖ‌ప‌ట్నం మీదుగా రాక‌పోక‌ల నిర్వ‌హించే ఆరు రైళ్లకు అద‌న‌పు కోచ్‌ల‌ను జత చేసింది.

1. తిరుప‌తి నుంచి వ‌యా పాకాల‌, క‌దిరి, ధ‌ర్మ‌వ‌రం, అనంత‌పురం, గుంక‌ల్లు, బళ్లారి, రాయ‌దుర్గం మీదుగా తిరుమ‌ల‌దేవ‌ర‌ప‌ల్లి వెళ్లే (57405) రైలును శ‌నివారం నుంచి ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు నిలిపివేశారు.

2. తిరుమ‌ల‌దేవ‌ర‌ప‌ల్లి నుంచి పాకాల‌, క‌దిరి, ధ‌ర్మ‌వ‌రం, అనంత‌పురం, గుంత‌క‌ల్లు, బళ్లారి, రాయ‌దుర్గం మ...