భారతదేశం, మార్చి 17 -- టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మారాడు. క్రిమినల్స్ ను చితక్కొట్టాడు. కోపంతో అరిచాడు. ఇలా ఆడిషన్ లో అన్నీ చేశాడు. కానీ చివరకు మాత్రం ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ టీమిండియా ప్రిన్స్ సినిమాల్లో యాక్ట్ చేయడం లేదు. సిరీస్ కోసమూ సెలక్ట్ కాలేదు. 'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' సిరీస్ కోసం దాదా ప్రమోషన్లో భాగమయ్యాడు.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో రాబోతున్న 'ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్' కోసం దాదా రంగంలోకి దిగాడు. నెట్‌ఫ్లిక్స్‌ సోమవారం (మార్చి 17) రిలీజ్ చేసిన ప్రోమోలో గంగూలీ అదరగొట్టాడు. బెంగాల్ పేరుతో సిరీస్ చేస్తూ దాదాను పిలవరా? అని గంగూలీ రాకతో ప్రోమో స్టార్ట్ అయింది. పోలీస్ రోల్ చేస్తానంటూ దాదా యాక్షన్ లోకి దిగిపోయాడు.

ఈ ప్రోమోలో కొన్ని క్రికెట్ రిఫరెన్స్ కూడా వాడుకున్నారు. దాదాకు కోపం రావాలంటూ చెప్పగా...