భారతదేశం, మార్చి 25 -- ప్రముఖ నటుడు సోనూసూద్ భార్య సోనాలీ సూద్‍ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సోనాలీ సోదరి, అల్లుడు కూడా ఈ ప్రమాదంలో గాయాల పాలైనట్టు సమాచారం. ముంబై-నాగ్‍పూర్ హైవేపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

సోనాలీ సూద్‍కు ఈ ప్రమాదంలో గాయాలు తీవ్రంగా అయినట్టు సోనూసూద్ ప్రతినిధి వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సోనాలీ సోదరి, అల్లుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి నాగ్‍‍పూర్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిిత్స అందిస్తున్నారు వైద్యులు.

సోనాలీ సూద్ ప్రయాణిస్తున్న కారుకు సోమవారం (మార్చి 24) రాత్రి రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ట్రక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న సోనూసూద్ వెంటనే ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. ప్రస్తుతం సోనాలీ, ఆమె సోదరి, అల్లుడికి వైద్యుల...