భారతదేశం, ఫిబ్రవరి 2 -- Sonam Kapoor Crying In Ramp Walk Video Viral: బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, స్టార్ హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ తాజాగా ఓ ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టేసుకుంది. ర్యాంప్ వాక్‌పై నడుస్తూ ఎమోషనల్ అయిపోయింది. దండం పెట్టి మరి ఏడ్చేసింది సోనమ్ కపూర్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గురుగ్రామ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో దివంగత ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్‌కు హృదయపూర్వక నివాళి అర్పిస్తూ భావోద్వేగానికి గురయింది సోనమ్ కపూర్. శనివారం (ఫిబ్రవరి 1) జరిగిన బ్లెండర్స్ ప్రైడ్ ఎఫ్‌డీసీఐ (Fashion Design Council of India) ఫ్యాషన్ టూర్ 2025లో నటి ర్యాంప్‌పై నడుస్తున్న అనేక వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వెలువడ్డాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోన్న ఒక వీడియోలో సోనమ్ కపూర్ ర్యాంప్‌పై నడుస్తు...