Hyderabad, మార్చి 9 -- Sonakshi Sinha In Sudheer Babu Horror Movie Jatadhara: సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ జటాధార మూవీతో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులోకి పరిచయం అవుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె కొత్త పోస్టర్‌ను రివిల్ చేశారు మేకర్స్. ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌లో యాక్షన్, మిస్టరీతో కూడిన పవర్‌ఫుల్ అవతార్‌లో సోనాక్షి సిన్హా కనిపించనున్నారు.

హీరామండిలో పవర్ ఫుల్ పాత్ర తర్వాత సోనాక్షి సిన్హా.. పౌరాణికాలు, యాక్షన్, అతీంద్రియ అంశాలను బ్లెండ్ చేసే పాన్-ఇండియా చిత్రం జటాధారతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే, జటాధరలోని సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ పోస్టర్ కాస్తా అటు ఇటుగా చంద్రముఖి పోస్టర్‌లా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

లూజ్ హెయిర్, కాస్తా చెరిగిన బొట్టు, మొహానికి చేయి అడ్డు పెట్టుకున...