Hyderabad, ఫిబ్రవరి 23 -- మనలో చాలా మంది ఫ్యామిలి టైంను బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ, ఫ్యామిలీతో కలిసి ఎంత ఎంజాయ్ చేసినా లోపల ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఉండిపోతుంది. సింగిల్‌గా ఉన్నప్పుడు గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటే, పెళ్లి అయిన జీవితంలో ఎంజాయ్ లేదనిపిస్తుంది. కానీ, గతాన్ని వెనక్కి తీసుకురాలేం. ఇప్పుడు ఉన్నట్టుండి రెక్కలు కట్టుకుని గతంలోకి వెళ్లిపోలేం. కానీ, పెళ్లయి పిల్లలు పుట్టాక వెనక్కి సీటుకే అతుక్కుపోయిన మీ లైఫ్‌లోకి సంతోషం తిరిగి రావాలంటే అప్పుడప్పుడు సోలో ట్రావెలింగ్ చేయాలి.

"నీకేంటి, మీరంతా కలిసే వెళ్తారు. కలిసే వస్తారు. పిల్లలతో పాటు కలిసి జర్నీ చేస్తున్నావ్ కదా.. హ్యాపీయే కదా" అన్న మాటలు విన్నప్పుడల్లా "గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది.. పుట్టే నొప్పి ఏంటో" అని ఊరుకోకండి. మీకు మీరే కాస్త ధైర్యం తెచ్చుకుని ఒక అడుగు ...