Hyderabad, మార్చి 16 -- ప్రేమ సంబంధాలు, వివాహాలు అన్నవి ఆధునిక కాలంలో ఎంతగానో మారిపోయాయి. మనం జీవిస్తున్న ఈ కాలంలో వాటి విలువలను కాపాడుకోవడం చాలా సంక్లిష్టంగా మారిపోయింది. ఇప్పుడు కొత్తగా సోలో పొల్యామరి అనే కొత్త డేటింగ్ ట్రెండ్ వచ్చింది. ఇది సాంప్రదాయ అనుబంధానికి పూర్తి విరుద్ధంగా ఉంది. దీనిలో ప్రేమ, నిబద్ధత వంటివి ఏమీ లేవు.

ఒకే సమయంలో ఎక్కువమంది భాగస్వాములను కలిగి ఉండవచ్చు. వారితో ఎవరితోనూ పెళ్లికి కమిట్ అవ్వరు. నచ్చినంత కాలం కలిసి ఉంటారు. తర్వాత విడిపోతారు. ఒకరితో కలిసి ఉంటూ మరొకరితో సినిమాలకు, షికారులకు తిరుగుతారు. అయినా సరే వారి భాగస్వాములు ప్రశ్నించకూడదు. అదే ఈ సోలో పొల్యామరి ట్రెండ్.

సోలో పొల్యామరిని ఆధునిక యువత షరతులు లేని ప్రేమగా చెప్పుకుంటారు. ఈ ప్రేమలో నిబద్ధత అవసరం లేదు. శృంగార సంబంధాలకు ఒక నిజాయితీ కూడా కనిపించదు.

మన దేశంల...