Hyderabad, మార్చి 26 -- ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మార్చి 29న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు, పాక్షిక గ్రహణం. అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి ఖచ్చితమైన అమరికలో అంటే ఒకే సమాంతర రేఖలో ఉండవు. దీని వల్ల సూర్యుని కొంత భాగం మాత్రమే కనిపించదు. ఈ ఖగోళ సంఘటన చూసేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. సూర్యగ్రహణం భారతేదేశంలో కనిపిస్తుందా? కనిపించదా? అనే సందేహం ఎక్కువమందికి ఉంది. తగిన కంటి రక్షణతో ఈ ఖగోళ అద్భుతాన్ని చూసేందుకు ఎంతో మంది సిద్ధమవుతున్నారు.

ఈ సూర్యగ్రహణాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలు చూడలేరు. అందుకే మనదేశానికి సూర్యగ్రహణం లేనట్టే. దీన్ని చూసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం ఉండదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి . మనకు సూర్యకాంతి సాధారణంగానే పడుతుంది.

ఈ సూర్యగ్రహణం తూర్పు, ఉత్తర కెనడాలో గ్రహణం ఎక్కువగా కనిపిస్తుంది.

* ఈశాన్య యునైటెడ్ స్ట...