Hyderabad, మార్చి 19 -- Sobhita Dhulipala Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్యతో ప్రేమ ఎలా మొదలైందో చెప్పింది శోభితా ధూళిపాళ్ల. తాజాగా ఈ జంట వోగ్ మ్యాగజైన్ ఏప్రిల్ ఎడిషన్ కోసం ఫొటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా అదే మ్యాగజైన్ తో మాట్లాడుతూ తమ లవ్ స్టోరీ ఎలా మొదలైందో శోభిత వెల్లడించింది.

నాగ చైతన్య, శోభిత గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. అయితే అంతకుముందు రెండేళ్లుగా వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. ఇదంతా ఓ సింపుల్ ఆస్క్ మీ ఎనీథింగ్ (ఏఎంఏ)లో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నతో మొదలైనట్లు శోభిత వెల్లడించడం విశేషం. "నేను ప్రశ్నలను చూస్తూ ఉన్నాను. అందులో ఓ ప్రశ్న ఆకర్షించింది.

మీరు ఎందుకు చైతన్య అక్కినేనిని ఫాలో చేయడం లేదు అని అడిగారు. అప్పుడు నేను ఏంటి అనుకున్నాను. ఆ తర్వాత అతని ప్రొఫైల్ లోకి వెళ్లి చూశాను. అతడు కేవలం...