భారతదేశం, ఫిబ్రవరి 7 -- తండేల్ రిలీజ్ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య‌ను ఉద్దేశించి అత‌డి భార్య శోభిత ధూళిపాళ్ల పెట్టిన ఓ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఫైన‌ల్లీ గ‌డ్డం షేవ్ చేస్తావు. మొద‌టిసారి నీ ముఖం ద‌ర్శ‌నం అవుతుంది సామీ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది శోభిత ధూళిపాళ్ల‌. అంతే కాకుండా తండేల్ సినిమా చేసేట‌ప్పుడు నువ్వు ఎంత ఫోక‌స్డ్‌గా, పాజిటివ్‌గా ఉన్నావో ప్ర‌త్య‌క్షంగా చూశాన‌ని, ఈ ఎక్స్‌ట్రార్డిన‌రీ ల‌వ్‌స్టోరీని థియేట‌ర్ల‌లో చూసేందుకు ఆడియెన్స్‌తో పాటు తాను ఎగ్జైటెడ్‌గా ఉన్న‌ట్లు ఈ పోస్ట్‌లో శోభిత పేర్కొన్న‌ది.

శోభిత పోస్ట్‌కు థాంక్యూ బుజ్జిత‌ల్లి అంటూ నాగ‌చైత‌న్య రిప్లై ఇచ్చాడు. శోభిత పోస్ట్‌, నాగ‌చైత‌న్య రిప్లై సోష‌ల్ మీడియాలో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. పెళ్లి త‌ర్వాత రిలీజ్ అవుతోన్న నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం ...