భారతదేశం, జనవరి 25 -- యూకేలోని బాత్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదువుతున్న, భారత సంతతికి చెందిన ఆదిత్య వర్మ.. తన స్నేహితులకు పంపిన స్నాప్ చాట్ మెసేజ్ పై స్పెయిన్ లో విచారణ ఎదుర్కొంటున్నాడు. 2022 జూలైలో వర్మ తన స్నేహితులతో కలిసి మెనోర్కా ద్వీపానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. తాను తాలిబన్ సభ్యుడినని, విమానాన్ని పేల్చివేస్తానని సరదాగా ఆ స్నాప్ చాట్ సందేశంలో పేర్కొన్నాడు.

గాట్విక్ విమానాశ్రయం నుంచి బయలుదేరే ముందు అతను తన స్నేహితులకు సరదాగా పంపిన స్నాప్ చాట్ సందేశం ఇలా ఉంది: "విమానాన్ని పేల్చివేయడానికి నేను వెళుతున్నాను (నేను తాలిబన్ సభ్యుడిని). విమానాశ్రయ వై-ఫై నెట్వర్క్ ఈ సందేశాన్ని గుర్తించింది. యూకే అధికారులు ఇది అత్యంత ప్రమాదకరమైన చర్యగా భావించి వెంటనే స్పానిష్ అధికారులకు సమాచారం అందించారు.

దీనికి ప్రతిస్పందనగా, స్పానిష్ వైమానిక దళం రెం...