భారతదేశం, ఫిబ్రవరి 15 -- స్మూతీలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరం భావిస్తాం. అయితే స్మూతీలలో కొన్ని పదార్థాలు కలపడం వల్ల జీర్ణ వ్యవస్థకు సమస్యగా మారతాయట. గ్యాస్, బ్లోటింగ్, చర్మ సమస్యలు వంటి ఇబ్బందులు కలగవచ్చు. పాలు లేదా పెరుగుతో పండ్లను కలపడం అనేది ముమ్మాటికీ కరెక్ట్ కాదట. అలా చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవగాహన లేకుండా స్మూతీలతో వేరే కాంబినేషన్లు ట్రై చేసి ఇబ్బందులు తెచ్చుకోకండి. కరెక్ట్ కాంబినేషన్ వాడి స్మూతీలను రెడీ చేసుకోవడం వల్ల శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి.

స్మూతీస్ అంటే లిక్విడ్ రూపంలో ఉండే ఫ్రూట్ జ్యూస్, నీళ్లు, కొబ్బరి నీళ్లు ఏవైనా కావొచ్చు. సాధారణంగా కూరగాయలు లేదా పండ్లను గ్రైండ్ చేసే లిక్విడ్ ఫాంను స్మూతీగా చెప్తుంటారు. చాలా మంది వీటిలో యోగట్ లేదా ఐస్ క్రీమ్ కూడా ...