Hyderabad, ఫిబ్రవరి 16 -- నవ్వు ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ ఏ రకంగా మంచిది, నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలేంటని చాలా మందికి తెలియదు. నిజానికి నవ్వడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా ప్రయోజనాలను పొందవచ్చట. అంతేకాదు ప్రస్తుత ప్రపంచంలో చాలా మందిని అనారోగ్యం పాలు చేస్తున్న ఒత్తిడిని తగ్గించే శక్తి చిరునవ్వుకు ఉందని ఈ మధ్య కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. నవ్వు నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? తాజా అధ్యయనాలు చిరునవ్వు గురించి ఎలాంటి విషయాలను చెబుతున్నాయి ఇక్కడ తెలుసుకోవచ్చు.

సాధారణంగా మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీకు తెలియకుండానే స్వచ్ఛమైన, అందమైన నవ్వు నవ్వుతారు. కానీ అది లోతైన ప్రయోజనాన్ని కలిగిస్తుందని మీకు తెలుసా? అవును నవ్వు మీ అంతర్గత ఆనందాన్ని ప్రతిబింబించడమే కాకుండా, సానుకూల భావోద్వేగాలను కూడా ఆకర్షిస్తుందట. జర్నల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీలో ప...