Hyderabad, ఫిబ్రవరి 11 -- రుతుస్రావం అనేది మహిళల్లో సహజ ప్రక్రియ. ఇది ప్రతి స్త్రీ జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ప్రతినెలా సమయానికి పీరియడ్స్ వస్తేనే వారు గర్భం దాల్చేందుకు అర్హులైన వారు అని అర్థం. పీరియడ్స్ సమయంలో గర్భాశయం లోపల నుండి రక్తం, కణజాలం వంటివి యోని ద్వారా బయటకు వస్తాయి. ఒక్కో మహిళకు ఈ ప్రక్రియ ఒక్కోలా ఉంటుంది.

కొంతమందికి ప్రతి 25 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తే మరికొందరికి 35 రోజులకు ఒకసారి వస్తుంది. ఈ సమయంలో చాలా మంది మహిళల్లో కడుపు నొప్పి, చర్మ సమస్యలను వంటివి ఎదుర్కొంటారు. అలాగే కొంతమంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే రక్తం దుర్వాసన వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందో తెలియక ఎంతో మంది స్త్రీలు ఇబ్బంది పడుతుంటారు. ఇలా పీరియడ్స్ రక్తం వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. మీకు ఎందుకు ఇలా దుర్వాసన వస్తుందో తెలుసుకోవడానికి వైద్యులను కూ...