భారతదేశం, జనవరి 5 -- ఇటీవలి కాలంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో ప్రపంచమే మారింది. అదే సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల గ్యాడ్జెట్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. వీటిలో స్మార్ట్‌వాచ్ మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా సాయపడుతుంది. రోజుకు ఎంత నడవాలి? హార్ట్ బీట్ ఎంతలాంటి వివరాలను స్మార్ట్‌వాచ్‌లు అందిస్తున్నాయి.

అయితే వాచ్ కూడా కొన్ని చెడు అలవాట్లను వదిలివేయడంలో సహాయపడుతుంది. ధూమపాన వ్యసనం నుండి మిమ్మల్ని విముక్తి చేసే అద్భుతమైన యాప్‌ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. దీనికి స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు. సాధారణంగా ధూమపానంతో సంబంధం ఉన్న కదలికలను గుర్తించేందుకు స్మార్ట్‌వాచ్‌లోని మోషన్ సెన్సార్‌లను ఉపయోగించే అనుకూల యాప్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ...