భారతదేశం, ఏప్రిల్ 6 -- వీకెండ్ టైంలో.. ఎంజాయ్ చేద్దామనే ఆలోచన నుంచి బయటకొచ్చి, సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఏం చేస్తారా అనే ఆలోచనలో పడ్డారా..? వాస్తవానికి వారు టైంను బంగారంలా భావిస్తారు. ప్రత్యేకించి రెండు వీకాఫ్ లు ఉన్నవారు ఈ ధోరణితో వ్యవహరిస్తుంటారు. టైం వినియోగించుకోవడంలో మ్యాజిక్ ఏం ఉండదు. కేవలం స్మార్ట్ ఛాయీస్‌లు మాత్రమే ఉంటాయి. మరి, సక్సెస్‌ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే ఆ 9 స్మార్ట్ ఐడియాలేంటో తెలుసుకుందా.

ఆలోచనలు హరించే సోషల్ మీడియా స్క్రోలింగ్ ట్రాప్‌లో వారు అస్సలు పడరు. ఒక నోటిఫికేషన్ వచ్చిందని, ఫోన్ పట్టుకుని గంటల కొద్దీ సమయాన్ని దాని కోసమే అస్సలు వెచ్చించరు. విలువైన, అమూల్యమైన సమయాన్ని ఉపయోగం లేని పనుల కోసం కేటాయించాలని అనుకోరు. వాస్తవానికి సోషల్ మీడియా అనేది ప్రత్యేకమైన విషయాలను, శక్తివంతమైన అంశాలను చూపించినా అందులో వేస్టేజ్ చాలా ఎక్కువగా ...