Hyderabad, మార్చి 17 -- ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా చేయాల్సింది నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవడం. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి ఫాస్ట్ ఫుడ్ ప్రియారిటీ తగ్గిపోయి అంతా మిల్లెట్స్ వైపు నడుస్తున్నారు. డయాబెటిస్, అరుగుదల లేకపోవడం వంటి సమస్యలు రాకుండా చేస్తాయనే నమ్మకంతో ఇలా చేస్తున్నారు. కానీ, చిరు ధాన్యాలుగా పిలుచుకునే మిల్లెట్స్‌ను సరైన పద్దతిలోనే తింటున్నారా..?, వండే విధానం సరైనదేనా? అని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, వాటిని వండే, తినే విధానాన్ని బట్టి వాటిల్లో పోషక విలువలు మారిపోతుంటాయి.

వరి గింజల పైన పొట్టు ఉంటుంది. దాని లోపలే బియ్యం ఉంటుంది. అది మూడు దశల్లో ఉంటుంది. మొదటిది బ్రాన్ (Bran). తర్వాత ఎండోస్పెర్మ్. చివరిది జెర్మ్. అలాగే, మిల్లెట్స్ కూడా. రాగులు, వరగు, సామె, కుదురు వంటి వాటిలోనూ మూడు దశలు ఉంటాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే, దంపుడు బియ్య...