Hyderabad, మార్చి 23 -- బిజీ లైఫ్ స్టైల్‌లో నిద్రలేమితో ఇబ్బంది పడే వాళ్లు చాలా మందే ఉన్నారు. పని ఒత్తిడి, మానసిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల నిద్రలేమి సమస్యకు గురవుతారు. వీరికి నిద్రపోవడానికి సమయం కేటాయించుకున్నా సరిగా నిద్రపోలేరు. అదే పరిస్థితి కొనసాగుతూ పోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని ఫ్లూ జ్వరాలు, ఇన్ఫెక్షన్లు వేగవంతంగా వ్యాపిస్తాయి. అంతేకాకుండా రక్తపోటు పెరిగి దీర్ఘకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

ఈ సమస్య రాకుండా ఉండాలంటే, నిద్రించే ముందు మీరు కొన్ని చిట్కాలు పాటించాలని ఆయుర్వేద నిపుణులు రాజా ఈశన్ చెప్పారు. నిద్రకు ఉపకరించే చిట్కాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగుతో ఆయన పంచుకున్నారు.

1. నిద్రించే ముందు రెండు గ్లాసుల నీటిని మరిగించి, అందులో ఒక పిడికెడు పంచదార వేయండి. అలా...