Hyderabad, ఏప్రిల్ 5 -- నిద్ర గురించి ఇంట్లో పెద్దలు చాలా విషయాలను చెబుతుంటారు. తల అటు పెట్టద్దు, తడి కాళ్లతో పడుకోవద్దు, మెడమీద మోచేతులు ఉంచద్దు అంటే. వీటిని ఉట్టి మాటలుగా తీసి పారేస్తుంటాం. నిజానికి ఇవి కేవలం ఉట్టి మాటలు కాదంట. వీటి వెనక శాస్త్రీయ కారణలెన్నో దాగి ఉన్నాయట. అవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయట. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

ఆరోగ్యంగా ఉండటానికి వేదాలలో అనేక నియమాలు ఉన్నాయి. అవి శాస్త్రీయంగా కూడా నిరూపించబడ్డాయి. ఇందులో సరైన ఆహారాలను తినడం, స్వచ్ఛమైన నీటిని త్రాగడం లాగే, చక్కటి నిద్రకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటించకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈమధ్య కాలంలో చాలా మందిని నిద్రలేమి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రి నిద్ర రాకపోవడం అనేది అది పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుండి బయ...