Hyderabad, మార్చి 4 -- తల్లి కావడం అనేది స్త్రీలకు ఒక అద్భుతమైన అనుభూతి. కానీ దీన్ని పొందడానికి మహిళ అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి మహిళ గర్భధారణ వేరు, వారు ఎదుర్కోనే సమస్యలు కూడా వేరు. కొందరు మహిళలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గర్భధారణను పూర్తి చేస్తారు, మరికొందరు అనేక శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇంకొందరు స్త్రీలు చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు.

గర్భిణిలలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య నిద్రలేమి. నిద్రలేకపోతే సాధారణ వ్యక్తులే చాలా రకాల సమస్యల బారిన పడతారు. అలాంటిది కడుపులో బిడ్డను మోస్తున్న తల్లి నిద్ర సరిగ్గా లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వాస్తవానికి ప్రెగ్నెన్సీ మొదట్లో చాలా మత్తు నిద్ర వస్తుంది. కానీ చివరి నెలలకు చేరుకునే కొద్దీ న...