తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 7 -- హైదరాబాద్ నగరం సరికొత్త వైద్య సేవలకు వేదికైంది. నిద్ర సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపేలా 'నిద్ర చికిత్సా కేంద్రాలు' ఏర్పాటయ్యాయి. మొదటి బ్రాంచ్ జూబ్లీ హిల్స్‌లో ఉండగా. రెండో బ్రాంచ్ కూకట్‌పల్లిలో అందుబాటులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు.

ఈ ప్రారంభ కార్యక్రమానికి కేంద్రా ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ డాక్టర్ లోరెంజో కోర్బెట్టా, బోలోగ్నా విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ డాక్టర్ పియెరో కాండోలి (పల్మోనాలజీ నిపుణులు) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ. నిద్ర యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నిద్ర లేకపోవడం వల్ల కలిగే తీవ్ర పరిణామాలను ప్రస్తావించారు. డయాబెటిస్, రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు మరియు అల్జీమర్స్ వంటి సమస్యలపై మాట్లాడారు. అత్యాధ...