Hyderabad, ఫిబ్రవరి 27 -- స్లీప్ డివోర్స్. ఇప్పుడు ఆధునిక కాలంలో దంపతుల మధ్య పెరిగిపోతున్న ట్రెండ్. భార్యాభర్తలు ఒకే ఇంట్లో కలిసి ఉన్నప్పటికీ రాత్రి నిద్రపోయే సమయంలో మాత్రం వేరువేరుగా పడుకోవడాన్ని ఎంచుకోవడం. స్లీప్ డివోర్స్ అంటే వేర్వేరు పడకలపై పడుకోవడం, వేరే గదిలో పడుకోవడం లేదా వేర్వేరు సమయాల్లో పడుకోవడం కావచ్చు. దీని అర్థం భార్యాభర్తల మధ్య సమస్య ఉందని మాత్రం కాదు.

గురక సమస్య నుంచి తప్పించుకోవడానికి, వేర్వేరు నిద్ర అలవాట్లు ఉన్నవారు ఇలా స్లీప్ డివోర్స్ పద్దతిని అనుసరిస్తున్నారు. ఇలా వేరువేరుగా పడుకోవడం కూడా భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మరింత బలపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిద్ర విడాకులు అంటే, దంపతులు తమ నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడానికి వేరువేరుగా పడుకోవడాన్ని ఎంచుకోవడం. స్లీప్ డివోర్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకరి నిద్రకు...