Hyderabad, ఫిబ్రవరి 19 -- రోజంతా అలసిపోయిన తర్వాత హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది. నిద్రపోతే శరీరానికి, మనసుకు కూడా విశ్రాంతి దక్కుతుంది. ఎవరైనా తమకు సౌకర్యవంతమైన నిద్రభంగిమలోనే పడుకుంటారు. ప్రతి ఒక్కరి నిద్రపోయే భంగిమలు చాలా భిన్నంగా ఉంటాయి. కొంతమంది వెల్లకిలా పొట్ట మీద పడుకుంటే, మరికొందరు పక్కకు తిరిగి నిద్రపోతారు.

మీరు ఎప్పుడైనా మీ నిద్ర స్థితిని గమనించారా? బాడీ లాంగ్వేజ్ నిపుణుల ప్రకారం, మీ నిద్రా భంగిమ మీ గురించి చాలా చెబుతుంది. దీనిపై తాజాగా ఒక పరిశోధన కూడా జరిగింది. దీని ప్రకారం మీరు నిద్రపోయే భంగిమ మీ ఆర్ధిక స్థితిని తెలియజేస్తుంది. ధనవంతులు నిద్రపోయే విధానం భిన్నంగా ఉంటుంది. ధనవంతులు నిద్రపోయే భంగిమను గోల్డ్ పొజిషన్ అంటారు. అంటే మీరు జీవితంలో ఎంత సక్సెస్ అయ్యారో, ఎంత సంపాదిస్తున్నారో మీరు నిద్రపోయే గోల్డ్ పొజిషన్ చూసి అంచనా వేయవచ్చ...