భారతదేశం, మార్చి 31 -- ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై.. సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద ప్రదేశంలో నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణను వేగవంతం చేసి, సహాయక చర్యలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు ప్రత్యేక అధికారి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నదని, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా, సింగరేణి మైన్స్ రెస్క్యూ, దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్రతికూల పరిస్థితుల్లోనూ 24 గంటల పాటు శ్రమిస్తున్నరని శివశంకర్ వివరించారు. 'సహాయక బృందాలు, నిపుణులు సమన్వయంతో పనిచేస్తున్నారు. మైనింగ్ ప్రమాదాల్లో నిష్ణాతులైన వారి సేవలను వినియోగించుకుంటున్నాం. వారి సలహా...