భారతదేశం, ఫిబ్రవరి 23 -- టన్నెల్‌లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కోసం అనేక రకాలుగా రెస్క్యూ చేస్తున్నామని.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవి, అధికారులతో సమీక్షలు చేస్తున్నామని చెప్పారు. శనివారం 13 కిలోమీటర్ల వరకు మూడు బృందాలు వెళ్లాయన్న ఉత్తమ్.. ప్రమాదం జరిగిన ప్లేస్‌లో నీళ్లు, మట్టి ఉండటంవల్ల లోపలికి వెళ్లలేకపోయారని వివరించారు.

'8 మంది ఉన్న ప్లేస్ లోకి వెళ్లడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ డ్రిల్లింగ్ చేసి అటువైపు వెళ్లడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పైన కూడా డ్రిల్లింగ్ చేసి ఘటన స్థలంలోకి వెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆర్మీ నుంచి ప్రత్యేక ఫోర్స్‌ను రమ్మని చెప్పాం. నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

'నిన్న మాత్రం సంఘట...