భారతదేశం, మార్చి 28 -- ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మృతదేహాల కోసం.. 35వ రోజు అన్వేషణ కొనసాగుతుంది. బురదలో కూరుకుపోయిన లోకో ట్రైన్ పరిసరాల్లో మరో సారి అనుమానిత ప్రాంతాన్ని కాడవర్ డాగ్స్ సూచించాయి. కాడవర్ డాగ్స్ సూచించిన ప్రదేశంలో సహాయక బృందాలు తవ్వకాలు మొదలుపెట్టాయి. తవ్వకాలలో ఉధృతంగా వస్తున్న నీటి ఊటతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

వస్తున్న నీటి ఊటను ఎప్పటికప్పుడు భారీ పంపులతో కృష్ణా నదిలోకి మల్లిస్తున్నారు. మూడు షిఫ్టులలో దాదాపు 600 మంది రెస్క్యూ బృందాలు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం నిర్మాణంలో ఫిబ్రవరి 22న పైకప్పు కూలి 8 మంది కార్మికులు గల్లంతైయ్యారు. ఆ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల మృతదేహాల కోసం దాదాపు నెల రోజులుగా సహాయక చర్యలు ...