భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. పైకప్పు కూలిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలు చేరుకుంటున్నాయి. ఘటనా స్థలంలో బండరాళ్లు, బురద, నీళ్లు ఉన్నాయి. ఘటనా స్థలం నుంచి వందల మీటర్ల వరకు మట్టి ఉంది. మట్టిని తవ్వడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. గల్లంతైన వారి కోసం శిథిలాల కింద గాలింపు చర్యలు చేపట్టారు.

ఐదు రోజులు గడుస్తున్నా.. సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. నీరుందని, పూడిక చాలా ఎత్తులో పేరుకుపోయిందని, శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని.. నిపుణులు చెబుతున్నారు. అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యల్ని చేపడుతున్నారు. సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన అన్నింటినీ తొలగించాలని నిర్ణయించారు.

సొరంగం మార్గంలో అడ్డుగా నిలిచిన టీబీఎం భాగాల్ని.. గ్యాస్ కట్టర్లతో కత్తిరించి వే...