తెలంగాణ,నాగర్ కర్నూల్, మార్చి 2 -- ఎస్‌ఎల్‌బీసీ టన్నెల దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 8 రోజులు గడిచినప్పటికీ. లోపల చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకురావటం అత్యంత సవాల్ గా మారిపోయింది. జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్నారు.

సొరంగం లోపల పరిస్థితులు అత్యంత కఠినంగా ఉన్నాయి. అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా. ఆ ఎనిమిది మంది సజీవంగా ఉండే అవకాశం లేదన్న వాదన తెరపైకి వస్తోంది. ప్రాథమికంగా కొన్ని ఆనవాళ్లు గుర్తించినప్పటికీ. అవి మృతదేహాలేనన్న అంచనాకు వస్తున్నారు. ఎక్కడైతే ఆనవాళ్లు కనిపించాయో. ఆయా ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి.

సొరంగంలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. లోపల ఊట ఎక్కువగా ఉండటంతో అనుకున్న స్థాయిలో సహాయక చర్యలు ముందుకు సాగలేకపోతున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారం. పనులు చేయ...