భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నిపుణులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ. కీలక ప్రకటన చేశారు. మరో రెండురోజుల్లో కార్మికుల ఆచూకీ తెలుసుకుంటామని చెప్పారు. వారంతా బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం చేశామని తెలిపారు.

"ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా స్పందించాం.రెండు రోజుల్లో SLBC ఘటన రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తి చేస్తాం. 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయింది. చిక్కుకున్న వారిని కాపాడటం కోసం పూడికలోకి వెళ్లాలని నిర్ణయించాం. పూర్తిగా నీటిని తోడేసి గ్యాస్ కట్టర్ సాయంతో బోరింగ్ మిషన్‌ను కట్ చేయాలి. ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం తగదు" అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించ...