తెలంగాణ,నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 27 -- ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా లోపల చిక్కుకుపోయిన కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆ 8 మందిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ. లోపల నెలకొన్న పరిస్థితులు సవాల్ గా మారాయి.

టన్నెల్‌లో జీరో పాయింట్‌ దగ్గర రెస్క్యూ ఆపరేషన్‌ పనులు కొనసాగిస్తున్నాయి. శిథిలాలను తొలగించే ప్రయత్నాల్లో రెస్క్యూ బృందాలు నిమగ్నమయ్యాయి. అయితే సహాయ చర్యల్లో మార్కోస్‌ కమాండోలు(ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్) కూడా భాగమయ్యాయి.

టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. SLBC టన్నెల్లో 2,3 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవుతుందన్నారు. కార్మికులను గుర్తించేందుకు పదకొండు విభాగాలు పని ...