తెలంగాణ,నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 23 -- శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గంలో శనివారం ఉదయం భారీ ప్రమాదం జరిగింది. కార్మికులంతా పనుల్లో నిమగ్నమైన సమయంలో 14వ కిలోమీటరు వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో సొరంగం లోపల అంతా అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే కొంతమంది అప్రమత్తమై. బయటికి రాగలిగారు. కానీ మరో ఎనిమిది మంది మాత్రం లోపలే చిక్కుకొనిపోయారు.

చిక్కుకుపోయిన వారిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లతో పాటు మరో నలుగురు కార్మికులు ఉన్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. వీరిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారిని బయటి తీసుకువచ్చేందుకు ఉన్న మార్గాలపై దృష్టి పెట్టి. ముందుకెళ్తోంది. సైన్యాన్నీ కూడా రంగంలోకి దింపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సొరంగంలో ప్రమాదం ఎలా జరిగింది..? ఇందుకు గల కారణాలేంటి..? వంటి విషయాలపై ...