భారతదేశం, ఫిబ్రవరి 22 -- SLBC Tunnel Collapse : శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్(SLBC) వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్ పైకప్పు కూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. కార్మికులను రక్షించేందుకు ప్రమాద స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా మంత్రులు తెలిపారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఘటనలో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కూలీలు బరదలో వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్‌ను కూడా పిలిపిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

ఇండియన్ ఆర్మీ, రెస్క్యూ టీమ్ సహాయాన్ని కోరినట్లు మంత్రులు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌తో పని మొదలు పెట్టగా మట్టి, నీరు వచ్చి చేరుతుందన్న...