తెలంగాణ,నల్గొండ, ఫిబ్రవరి 28 -- SLBC టన్నెల్‌ లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో చిక్కుకుపోయిన ఆ ఎనిమిది మంది విషయంలో ఆశలు సన్నగిల్లినప్పటికీ. ప్రయత్నాలు మాత్రం ఆగటం లేదు. ఆరు రోజులపైగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగా. తాజాగా పురోగతి కనిపించినట్లు సమాచారం.

గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జీపీఆర్) సాయంతో సొరంగంలో కార్మికుల ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిసింది. అవి మృతదేహాలుగా అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా ఆచూకీ లభ్యమైనప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇక ప్రమాదం జరిగిన నాటి నుంచే ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌‌ చేపట్టారు. అయితే సొరంగంలోని పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవటంతో.. దాదాపు 11కుపైగా విభాగాలను రంగంలోకి దింపాల్సి వచ్చింది. గ్యాస్‌ కట్టర్‌తో బోరింగ్‌ మెషీన్ శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టారు. బు...