భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఎస్ఎల్‌బీసీ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో చెప్పారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలంలో ఉన్నారని.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ స్క్వాడ్‌లతో పాటు.. అవసరమైన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న తీరును రాహుల్ గాంధీకి వివరించారు రేవంత్ రెడ్డి. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలతో పాటు.. ఆ కుటుంబాలను ఆదుకోవాలని రాహుల్ గాంధీ రేవంత్...